కేసరి బొండా
కావలసిన పదార్ధాలు:-
1) బొంబాయి రవ్వ : 1 కప్పు
2) చక్కెర : 1.5 కప్పు
3) నెయ్యి/డాల్డా : 50 గ్రాములు
4) జీడిపప్పు : తగినన్ని
5) యలుకులు : 2
6) మైదా పిండి :1.5 కప్పు
7) ఉప్పు : చిటికెడు
8) వంట సొడా : చిటికెడు
9) నూనె : వెయించుటకు తగినంత
10) నీళ్ళు : 1 కప్పు
11) పాలు : 1 కప్పు
చేయువిధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, నెయ్యి లొ జీడిపప్పు వేయించి ప్రక్కన పెట్టుకొవాలి. అదే బండీలొ బొంబాయి రవ్వ ను కొద్దిగ రంగు వచేవరకు వేయించాలి. వేయించిన రవ్వను వేరె గిన్నెలొకి తీసుకొవాలి. అదే బాండీలొ నీళ్ళు, పాలు పొసి మరగించాలి, వేయించిన రవ్వను వేసి వుండ కట్టకుండగ కలియపెడుతూవుండాలి. రవ్వ వుడికెవరకు అలాగే కలియపెడుతూవుండాలి. ఆతరువాత స్టవ్ సిమ్ లొ పెట్టి కొదిగా నెయ్యి, యాలుకలు పొడి, చక్కెరవేసి దగ్గరపడె వరకు కలియపెట్టాలి. దగ్గరపడిన తరువాత స్టవ్ నుండి దించి ప్రక్కన పెట్టుకొవాలి. దీనిని కాసేపు చల్లారనివ్వాలి. ఈలొపు మైదాపిండిలొ వుప్పు, వంట సొడా నీళ్ళు పొసి బజ్జి పిండిలా కలుపుకొవాలి. తరువత స్టొవ్ మీద బాండీ పెట్టి వేయించడానికి సరిపడ నునె పొసి కాగనివ్వలి. తరువాత చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగ చెసుకొని ముందుగ వేంచుకున్న జీడిపప్పును ఒక్కొక్కదాన్ని రవ్వ ఉండలపై పెట్టి మైదాపిండిలొ ముంచి నునెలొ వేసి రంగువచేవరకు వేయించుకొవాలి. అంతే వేడి వేడి కెసరి బొండాలు రెడి.